గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు దక్కింది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ లో రామ్ చరణ్‌కు గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్లడించింది. ఇక ఈ అవార్డు కోసం రామ్ చరణ్‌తో పాటు అదా శర్మ, విషెస్ బన్సల్, అర్జున్ మాథుర్, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, రిద్ధి డోగ్రా, రాశి ఖన్నా.. నామినేషన్స్ దక్కించుకోగా చరణ్‌ని ఈ అవార్డు వరించింది.














