Skip to main content

Namaste NRI

రామ్‌ చరణ్‌కు ప్రతిష్టాత్మక పాప్ గోల్డెన్ అవార్డ్  

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మ‌రో అరుదైన గుర్తింపు దక్కింది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వ‌హించే పాప్ గోల్డెన్ అవార్డ్స్   లో రామ్ చ‌ర‌ణ్‌కు గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు ద‌క్కింది. ఈ విష‌యాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్ల‌డించింది. ఇక ఈ అవార్డు కోసం రామ్ చ‌ర‌ణ్‌తో పాటు అదా శర్మ, విషెస్ బన్సల్, అర్జున్ మాథుర్, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, రిద్ధి డోగ్రా, రాశి ఖన్నా.. నామినేషన్స్ దక్కించుకోగా చరణ్‌ని ఈ అవార్డు వరించింది.

Social Share Spread Message

Latest News