ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే నెలలో జరిగే మారిషన్ 57వ జాతీయ దినోత్సవానికి ప్రధాని గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని మారిషన్ ప్రధాని రామ్ గూలమ్ అధికారికంగా ప్రకటించారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఈ వేడుక సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు. ప్రపంచ అధినేతల్లో ఒకరైన మోదీ, తన బిజీ షెడ్యూల్ లోనూ తమ ఆహ్వానాన్ని అంగీకరించడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 1968 మార్చి 12న బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన మారిషస్ కు స్వాతంత్ర్యం దక్కింది. నాటినుంచి ఏటా మార్చి 12న జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది.
