
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మారిషస్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోర్టు లూయిస్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మారిషస్‌లో ల్యాండ్ అయినట్లు మోదీ వెల్లడించారు. స్నేహితుడు, ప్రధాని డాక్టర్ నవీన్‌చంద్ర రామ్‌గూలమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన పర్యటన ద్వారా మారిషస్‌తో అనేక రంగాల్లో కొత్త సంబంధాలు ఏర్పడనున్నట్లు చెప్పారు. అధ్యక్షుడు ధరమ్ గోకుల్‌తో భేటీ కానున్నట్లు ఆయన వెల్లడించారు. ఓ కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లో పాల్గొననున్నట్లు చెప్పారు. భారతీయ సంతతి ప్రజలు మోదీకి స్వాగతం చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.
