ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో ఘనతను అందుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. సెలబ్రిటీలతో పోటీ పడుతూ మరీ సోషల్ మీడయాతో దూసుకెళ్తున్నారు. మోదీకి మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక పాపులారిటీ ఉన్న నేతగానూ మోదీ ఉన్నారు. ఇదే క్రమంలో వీడియో ప్లాట్ఫామ్ యూట్యూబ్ లోనూ ప్రధాని మోదీ చానెల్ తాజాగా రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఏ దేశాధినేతకు దక్కని రికార్డు సృష్టించింది. నరేంద్ర మోదీ పేరుతో ఉన్న ప్రధాని అధికారిక యూట్యూబ్ చానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కోటీ దాటింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్ర నాయకుల యూట్యూబ్ ఛానెళ్ల సబ్స్క్రైబర్ల సంఖ్యను గమనిస్తే మోదీనే టాప్లో ఉన్నారు.














