Namaste NRI

ప్రపంచంలోనే ఎత్తైన రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని!

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనతో హిందువుల దశాబ్దాల కలను సాకారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మరో చరిత్రకు నాంది పలికారు. ఇటీవలే అక్కడి రామాలయంపై కాషాయం జెండాను ఎగురేసిన మోడీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గోవాలోని చరిత్రాత్మక శ్రీ సంస్థాన్ గోకర్ణ్ జోవోత్తమ్ మఠం లో 77 అడుగుల ఎత్తైన రాముడి కాంస్య విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు.

దక్షిణ గోవాలోని ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ సంస్థాన్ గోకర్ణ్ జోవోత్తమ్ మఠం ఏర్పడి నవంబర్ 28 గురువారం నాటికి 550వ సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ప్రత్యేక సందర్భంగా పునస్కరించుకొని ప్రధాని మఠంలో 77 అడుగుల ఎత్తైన కోదండరాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ అయోధ్య రామాలయంపై కాషాయం జెండాను ఎగరేసిన రెండుమూడు రోజులకే రాముడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం తనకు దక్కడం చాలా సంతోషంగా ఉంద ని అన్నారు. 

Social Share Spread Message

Latest News