ప్రియదర్శి ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గీతా ఆర్ట్స్ 2 బాధ్యతల నుంచి విరామం తీసుకున్న నిర్మాత బన్నీ వాస్, తన సొంత బ్యానర్ బన్నీ వాస్ వర్క్స్‌ని ప్రారంభించి, దానిలో మొదటి సినిమాగా ఒక కొత్త ఎంటర్‌టైనర్‌ను నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి మిత్రమండలి అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు ప్రియదర్శి. ఈ మూవీకి సంబంధించి అప్‌డేట్‌ను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఇక ఈ సినిమాను బన్నీ వాస్‌తో పాటు, ఐరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సప్త అశ్వ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాతో ఎస్ విజయేంద్రను దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించబోతున్నాడు.
