కమెడియన్‌గా మొదలై, తక్కువ సమయంలోనే హీరోగా ప్రమోట్ అయ్యాడు ప్రియదర్శి. తనను హీరోగా పెట్టి సినిమాలు తీయడానికి నిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా ప్రియదర్శి చేయనున్న కొత్త సినిమా కు చెందిన ప్రకటన మేకర్స్ విడుదల చేశారు. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి జాన్వీ నారంగ్ నిర్మాత. సునీల్ నారంగ్, భరత్ నారంగ్, ఎస్‌వీఏసీఎల్‌ఎల్‌పీ, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా కలిసి సగర్వంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇద ని, ఇందులో ప్రియదర్శి విభిన్నమైన పాత్రను పోషించనున్నారని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంబం ధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని మేకర్స్ తెలిపారు.