
ప్రియదర్శి హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సారంగపాణి జాతకం. రూప కొడువాయూర్ కథానాయిక. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. వీకే నరేష్, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరా ల, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా అతను చేసే పనుల్లో ఉంటుందా? అనే ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఆద్యంతం చక్కటి హాస్యంతో సాగే చిత్రమిది. హైదరాబాద్, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ఈ నెల 12 నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తాం. మా బ్యానర్‌లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌సాగర్, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
