గద్దె శివకృష్ణ మరియు వెలగ రాము సంయుక్తంగా నిర్మిస్తున్న హార్దిక క్రియేషన్స్ బ్యానర్ పై సిగటాపు రమేష్ నాయుడు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం పంచానామ. పంచనామ సినిమా టైటిల్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. సిగటాపు రమేష్ నాయుడు దర్శకుడు. ఈ సందర్భంగా దర్శకుడు సిగటాపు రమేష్ నాయుడు మాట్లాడుతూ కథ విని నన్ను నమ్మి ఈ బాధ్యత అప్పగించారు. ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీసేందుకు సహకరించిన నిర్మాతలకు చాలా కృతజ్ఞతలు. ఒక వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని జనాదరణ పొందే విధంగా నిర్మాణ విలువలతో తీయడం జరిగింది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. ఈ చిత్రంలో త్రిపుర నిమ్మగడ్డ వెంపకాశీ, సంజీవ్ జాధవ్, ముక్కు అవినాష్, ఆలపాటి లక్ష్మి, అంజనేయులు తదితరులు నటిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)