Skip to main content

Namaste NRI

పంచనామ టైటిల్ ని విడుదల చేసిన నిర్మాత దిల్ రాజు

గద్దె శివకృష్ణ మరియు వెలగ రాము సంయుక్తంగా నిర్మిస్తున్న హార్దిక క్రియేషన్స్‌ బ్యానర్‌ పై సిగటాపు రమేష్‌ నాయుడు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం పంచానామ. పంచనామ సినిమా టైటిల్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఆవిష్కరించారు.  సిగటాపు రమేష్‌ నాయుడు దర్శకుడు. ఈ సందర్భంగా దర్శకుడు సిగటాపు రమేష్‌ నాయుడు మాట్లాడుతూ కథ విని నన్ను నమ్మి ఈ బాధ్యత అప్పగించారు. ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా తీసేందుకు సహకరించిన నిర్మాతలకు చాలా కృతజ్ఞతలు. ఒక వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని జనాదరణ పొందే విధంగా నిర్మాణ విలువలతో తీయడం జరిగింది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. ఈ చిత్రంలో త్రిపుర నిమ్మగడ్డ వెంపకాశీ, సంజీవ్‌ జాధవ్‌, ముక్కు అవినాష్‌, ఆలపాటి లక్ష్మి, అంజనేయులు తదితరులు నటిస్తున్నారు.

Social Share Spread Message

Latest News