తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎన్ఆర్ఐ కౌన్సిల్ రాధాకృష్ణ ఆదేశానుసారం, పులివర్తి నాని సూచనల మేరకు టీడీపీ అధినేతకు తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం అనే నినాదంతో సోషల్ మీడియా కోఆర్డినేటర్ వడ్లమూడి సారథి నాయుడు పిలుపు మేరకు సౌదీ అరేబియా రియాద్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నియోజకవర్గాలకు చెందిన ప్రవాస భారతీయులందరూ ఒకచోటకు చేరారు. ఈ సందర్భంగా వడ్లమూడి సారథి నాయుడు మాట్లాడుతూ మనకోసం, భావితరాల భవిష్యత్తు కోసం తన 45 సంవత్సరాల జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడును అర్ధరాత్రి నిద్రలోంచి లేపి మరీ అత్యంత అరాచకంగా, అక్రమంగా అరెస్టు చేసిన విధానం చూసి ప్రపంచంలోని ప్రతి తెలుగువారి గుండె బద్దలైందని అన్నారు. జై బాబు జై జై బాబు, చేయి చేయి కలుపుదాం మన నాయకుడు కోసం మనమందరం తోడుగా అని నినదిస్తూ, మీకు అండగా మేము నిలబడతాం అనే ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన ముండ్లూరి చలపతిరావు, మంగళగిరి సురేష్, చక్రపాణి, హేమంత్ కుమార్, పోకూరి దేవరాజులు, నరసింహులు, చంద్రబాబు,దుర్గా, కిరణ్ కుమార్, చీరాల నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.