అమెరికాలో పాలస్తీనా అనుకూల నిరసనలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. పలు యూనివర్సిటీల్లో భారత్ సహా వివిధ దేశాల విద్యార్థులు పాలస్తీనాకు సంఘీభావంగా, మద్దతుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. శిబిరాలు సైతం ఏర్పాటు చేసుకొని పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ప్రతి వర్సిటీ లో పదుల సంఖ్యలో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనలు విరమించుకోవాలని పలు యూనివ ర్సీటీల యాజమాన్యాలు విద్యార్థులతో చర్చలు జరుపుతున్నాయి. మరోవైపు నిరసనల సెగలు అమెరికా అధ్యక్షుడి నివాస భవనం వైట్‌హౌస్‌ను కూడా తాకాయి. బైడెన్ వైట్ హౌస్‌లో ఇచ్చే ఎన్నికల ఏడాది విందుకు హాజరైన వేలాది జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలను నిరసనకారులు విమర్శించారు. పాలస్తీ నాకు స్వేచ్ఛ ఇవ్వండి అంటూ నినాదాలు చేశారు.