Namaste NRI

కిమ్‌కు ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన పుతిన్

 ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌  ఇటీవలే ఉత్తర కొరియా లో పర్యటించిన విషయం తెలిసిందే. దాదాపు 24 ఏళ్ల తర్వాత పుతిన్‌ ఆ దేశంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఇద్దరు నేత‌లూ ఒక‌రికొకరు ప‌లు ర‌కాల బ‌హుమ‌తుల‌ను ఇచ్చి పుచ్చుకున్నారు.  తన పర్యటన సందర్భంగా ఉత్తర కొరియా అధినేతకు పుతిన్‌ అత్యంత ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. రష్యన్‌ మేడ్‌ లిమోసిన్‌ను గిఫ్ట్‌ చేశారు. అనంతరం ఇద్దరూ ఈ కారులో సరదాగా డ్రైవ్‌కు వెళ్లారు. ఆ సమయంలో పుతిన్‌ కారును స్వయంగా డ్రైవ్‌ చేయడం విశేషం. పుతిన్‌ పక్కనే కిమ్‌ కూర్చొని ఉన్నారు. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events