రష్యా విపక్షనేత అలెక్సీ నావల్నీ మరణం వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేయలేదని అమెరికా నిఘా వర్గాలు నిర్ణయించాయి. చాలా కాలంగా జైల్లో ఉన్న నావల్నీ ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించా రు. అయితే అంతిమంగా నావల్నీ మరణానికి పుతిన్ కారణమయ్యారని అమెరికా అధికారులు నమ్ముతున్నా రు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ తిరిగి ఎన్నికవ్వడానికి సరిగ్గా ముందు ఈ సంఘటన జరిగింది. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందిస్తూ నావల్నీ మరణానికి పుతిన్ బాధ్యుడని ఆరోపించారు.
అయితే నేరుగా పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండక పోవచ్చని బైడెన్ అభిప్రాయపడ్డారు. నావల్నీకి ఏం జరిగిందో ఖచ్చితంగా అమెరికాకు తెలియదని, అయితే పుతిన్, అతని దుండగులు ఏదో చేసినదానికి పర్యవసానమే నావల్నీ మరణమని ఏమాత్రం సందేహం లేదని బైడెన్ ఆరోపించారు. రష్యా అధికారులు మాత్రం నావల్నీ మరణం పూర్తిగా సహజమైన కారణాలతోనే జరిగిందని చెబుతున్నారు. అతడిపై విషప్రయోగం, హత్యకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు.