సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించింది. అధ్యక్షుడు పుతిన్ స్వయంగా దీనికి ఆమోదం తెలిపారని క్రెమ్లిన్ (రష్యా అధ్యక్ష భవనం) ప్రకటించింది. రాజకీయ ఆశ్రయం కల్పించాలన్న అసద్ అభ్యర్థనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆమోద ముద్ర వేశారని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ నేతల మధ్య ఎలాంటి సమావేశం లేదని స్పష్టం చేశారు. అసద్ ఆచూకీ గురించి వివరాలు చెప్పేది కూడా ఏమీ లేదన్నారు. అసద్‌కు రాజకీయ ఆశ్రయం ఎలా లభించిందని ప్రశ్నించగా ఇటువంటి నిర్ణయాలు దేశాధినేత జోక్యం లేకుండా జరగవని, ఇది పుతిన్ సొంత నిర్ణయమని చెప్పారు.