రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖరీదైన గిఫ్ట్ అందుకున్నారట. అయితే ఆ బహుమతి ఇప్పుడు ఇచ్చింది కాదు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలు పెట్టకముందు ఆ ఖరీదైన బహుమతిని బైడెన్ స్వీకరించారు. 2021 జూన్‌లో జెనీవాలో జరిగిన ఓ సమావేశంలో బైడెన్, పుతిన్ భేటీ అయ్యారు. ఆ సమయంలో రష్యన్ పెన్ను, డెస్క్ సెట్ ను పుతిన్ బైడెన్‌కు బహుమతిగా ఇచ్చారు. వాటి విలువ సుమారు 12వేల డాలర్లు. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు రూ.పది లక్షలు అన్నమాట. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగశాఖకు చెందిన ప్రోటోకాల్ విభాగం వెల్లడించింది. వాటితోపాటు ఓ జత ఏవియేటర్ సన్ గ్లాసెస్, అమెరికా జాతీయ జంతువైన అడవి దున్న క్రిస్టల్ నమూనాను బైడెన్‌కు పుతిన్ బహుమతిగా అందజేశారు. వాటిని బైడెన్ స్వీకరించినట్లు ప్రోటోకాల్ విభాగం తెలిపింది.