
యూరప్ దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒక వేళ యూరప్ యుద్ధాన్ని కోరుకుంటుంటే దీటుగా స్పందించడానికి రష్యా సన్నద్ధంగా ఉందని చెప్పారు. మేము సంఘర్షణను కోరుకోవడం లేదు. ఒక వేళ యూరప్ కనుక దానిని ప్రారంభిస్తే అది త్వరగా ముగుస్తుంది. ఎవరూ చర్చలు జరపడానికి మిగిలి ఉండరు అని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో రష్యా పూర్తి స్థాయిలో యుద్ధం చేయడం లేదన్నారు. తాము పరిమితంగానే నిర్దేశిత లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తున్నామన్నారు. అదే యూరప్‌తో సంఘర్షణ ఏర్పడితే పరిస్థితి పూర్తి వేరుగా ఉంటుందని, తాము పూర్తి బలం, బలగంతో బరిలోకి దిగుతామని ఆయన హెచ్చరించారు.















