Skip to main content

Namaste NRI

క్యాలిటీ చిత్రాన్ని ప్రేక్షకులకు ఇవ్వాలి..  నిర్మాత శివశంకర్‌

కామినేని శ్రీనివాస్‌ సమర్పణలో, పిఎస్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సునీల్‌, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందోతున్న ఫిక్షన్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం దర్జా. సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివశంకర్‌ పైడిపాటి నిర్మించారు. కో అండ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు శివశంకర్‌ పైడిపాటి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా రవి పైడి పాటి మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.  దర్జా సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాం. ఫస్ట్‌ కాపీ చూశాక టీమ్‌ అంతా హ్యాపీ. ఇందులో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. ఇది పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్‌ చిత్రం. ఒక పట్టణంలో అనేక ఇబ్బందుల ఎదుర్కొన్న యువతి ఆ తర్వాత ప్రజలకు ఎలా సమస్యగా మారింది? అనేది ప్రధాన కథాంశం. ప్రస్తుతం ఓ మల్టీస్టారర్‌ ప్రాజెక్ట్‌ రెడీగా ఉంది అన్నారు.

Social Share Spread Message

Latest News