Namaste NRI

రఘుకుంచే గేదెలరాజు కాకినాడ తాలూకా ఫస్ట్‌లుక్‌

చూస్తే ఒకటే నిజం,  చూడకపోతే వంద అనుమానాలు అనే సత్యాన్ని తెలిపే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం గేదెలరాజు కాకినాడ తాలూకా. కుంచె రఘు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకుడు. వాణి రవికుమార్‌ మోటూరి నిర్మాత. కుంచె రఘు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు చెందిన ఆయన ఫస్ట్‌లుక్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ లుక్‌లో ఫెరోషియస్‌గా కనిపిస్తున్నారాయన. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ చిత్రంలో రవి ఆనంద్‌ చినిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్‌, మౌనిక ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె.

Social Share Spread Message

Latest News