కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మే 31న అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. పది రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. జూన్ 4న న్యూయార్క్‌లోని మేడిసన్ స్వ్కేర్ గార్డెన్‌లో జరిగే ర్యాలీలో సుమారు అయిదు వేల మంది ఎన్ఆర్ఐలు పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నారైలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించనున్నారు. రాహుల్ తన పర్యటనలో వాషింగ్టన్, కాలిఫోర్నియాలో జరిగే ప్యానల్ డిస్కషన్‌లో పాల్గొంటారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు. అలాగే పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలను కలుసుకుంటారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన జూన్ 22న ఖరారైన నేపథ్యంలో రాహుల్ కూడా అమెరికాలో పర్యటించనుండటం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది.