Namaste NRI

యూఎస్ ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్‌గా రాజాచారి నామినేట్

భారత సంతతి వ్యోమగామి రాజాచారికి అమెరికా వైమానిక దళ(యూఎస్ఏఎఫ్) బ్రిగేడియర్ జనరల్ హోదా లభించనుంది. ఈ మేరకు దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆయన్ను నామినేట్ చేశారు. ఈ నామినేషన్ను సెనేట్ ఆమోదించాల్సి ఉందని అమెరికా రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. చారి కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ 461వ ఫ్లైట్ టెస్టు స్క్వాడ్రన్ కమాండర్‌గా, ఎఫ్35 ఇంటిగ్రేటెడ్ టెస్టుఫోర్సు డైరెక్టర్‌గా పనిచేశారు. కాగా చారి తన కెరీర్‌లో 2500గంటల కంటే ఎక్కువసేపు విమానయానంలో గడిపారు. ప్రస్తుతం ఆయన అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో క్రూ-3 కమాండర్గా వ్యవహరిస్తున్నారు.  భారత్లోని హైదరాబాద్కు చెందిన చారి, ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం అమెరికాలోనే స్థిరపడ్డారు. నాసాకు, యూఎస్ఏఎఫ్‏లో పలు విభాగాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events