ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రాజాసాబ్. మారుతి దర్శకుడు. ఈ మూవీలో మలయాళ భామ మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. నిధి అగర్వాల్ హైదరాబాద్ లో జరుగుతున్న రాజాసాబ్ షూట్‌లో జాయిన్ అయిందట. కొన్ని రోజులుగా జరుగుతున్న షూటింగ్‌లో ప్రభాస్, నిధి అగర్వాల్‌పై వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని ఇన్‌సైడ్ టాక్. తాజా షెడ్యూల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారట. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.సంజయ్ దత్ ఇందులో ప్రభాస్ తాతగా కనిపించబోతున్నాడట, రాజాసాబ్ లో రిద్ది కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలకు ప్లాన్ చేస్తోంది మారుతి టీం. ఇప్పటికే లాంఛ్ చేసిన రాజాసాబ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ 2025 సంక్రాంతి సీజన్‌లో విడుదల కానుంది.