
అగ్ర హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ ఛార్మింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటివరకు చేయని హారర్ కామెడీ జోనర్ కావడంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త రొమాంటిక్ అవతారంలో కనిపిస్తారు. వినోదంతో పాటు కావాల్సినంత యాక్షన్ హంగులుంటాయి. అభిమానులకు ఓ పండగలా దర్శకుడు మారుతి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, రచన-దర్శకత్వం: మారుతి.
