Namaste NRI

రాజేంద్రప్రసాద్‌, అర్చన ప్రధాన పాత్రల్లో షష్టిపూర్తి

రాజేంద్రప్రసాద్‌, అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం షష్టిపూర్తి. పవన్‌ప్రభు దర్శకత్వం. ఈ చిత్రాన్ని రూపేష్‌ చౌదరి నిర్మిస్తున్నారు. 80శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆవిష్కరించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ పిల్లలు తమ తల్లిదండ్రుల పెళ్లిని చూడరు కాబట్టి, షష్టి పూర్తి ద్వారా భగవంతుడు ఆ లోటును తీర్చుకునే అవకాశం కల్పించాడు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని సుందరమైన గోదావరి లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది అన్నారు. కుటుంబ విలువలు ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, త్వరలో కొత్త షెడ్యూల్‌ను మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్‌, సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, దర్శకుడు: పవన్‌చంద్ర.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events