రాజ్‌తరుణ్, రాశీసింగ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రమేష్ కడుములు దర్శకుడు. ఈ చిత్రాన్ని మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మారుతి క్లాప్‌నివ్వగా, ప్రవీణ్ సత్తారు కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజే స్తూ ఇది క్రైమ్ కామెడీ కథాంశం. స్వామిరారా, అంధాధున్ తరహాలో ఉంటుంది. ఈ నెల 15నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అన్నారు. తన ఫేవరేట్ జోనర్ అయిన క్రైమ్ కామెడీ కథాంశంతో సినిమా చేయడం ఆనందంగా ఉందని రాజ్ తరుణ్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఆదిత్య జవ్వాడి, సంగీతం: శేఖర్ చంద్ర, రచన-దర్శకత్వం: రమేష్ కడుముల.