ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం రాజు గారి కోడిపులావ్. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శివ కోన ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగించుకుని ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ డైరెక్టర్ శివకోన మాట్లాడుతూ సినిమాను నమ్మి చిన్న క్యారెక్టర్ అయినా మాకెంతో బ్యాక్ బోన్ గా ఉన్న ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాస్ట్ అండ్ క్రూకు శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు చెప్పారు. చిన్న బడ్జెట్ సినిమాలా లేదని పెద్ద సినిమాలో ఉందని అందరూ అంటున్నారు అంటే దానికి కారణం సినిమా కోసం యూనిట్ అంతా ఎంతో కష్టపడిందని వివరించారు. సినిమాను కచ్చితంగా థియేటర్లోనే ఆగస్టు 4న చూడండి లేదంటే మీరు ఎంతో మిస్ అవుతారని పేర్కొన్నారు. ఈ సినిమాకు పవన్ గుంటుకు సినిమాటోగ్రాఫర్ గా, సినిమాకు ప్రాణం అయిన సంగీతాన్ని ప్రవీణ్ మనీ, ఎడిటర్ గా బసవ పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా రాజు గారి కోడి పులావ్ ఆగస్ట్ 4న విడుదల కావడానికి రంగం సిద్ధం అయింది.
