Namaste NRI

మనసుల్ని కదిలించిన రాజుయాదవ్‌: గెటప్‌ శ్రీను

 గెటప్‌ శ్రీను హీరోగా నటిస్తూ చిత్రం రాజుయాదవ్‌. కృష్ణమాచారి దర్శకత్వం.  కె.ప్రశాంత్‌, రాజేశ్‌ కల్లెపల్లి నిర్మించారు. రాజుయాదవ్‌ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా గెటప్‌ శ్రీను మాట్లాడారు. సినిమా అనేది మనసుల్ని కదిలిస్తే అది నిజమైన సక్సెస్‌. అలాంటి విజయాన్ని రాజుయాదవ్‌ ద్వారా పొందాను అంటూ ఆనందం వ్యక్తం చేశారు. 

ఈ సినిమా విజయం దర్శకుడిది. భవిష్యత్తులో ఆయన మరెన్నో మంచి సినిమాలు తీయాలి. నాలుగో రోజే మా సినిమా బ్రేక్‌ ఎవెన్‌ అవ్వడం ఒక నటుడిగా చెప్పలేని ఆనందంగా ఉంది. నిర్మాతలు హ్యాపీగా ఉంటే పరిశ్రమ బావుంటుంది. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ నా ధన్యవాదాలు అని గెటప్‌శ్రీను చెప్పారు. ఇంకా యూనిట్‌ సభ్యులంతా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events