Namaste NRI

రాక్షస టైటిల్ సాంగ్ విడుదల

కన్నడ హీరో ప్రజ్వల్ దేవరాజ్ నటిస్తున్న తాజా చిత్రం రాక్షస. లోహిత్ హెచ్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు భాషల్లో ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు. నిర్మాత ఎంవీఆర్ కృష్ణ ఈ సినిమా తెలుగు హక్కులను దక్కించుకున్నారు. అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి స్వరకర్త. ఈ సినిమా టైటిల్ సాంగ్ను విడుదల చేశారు. ప్రేమ్ బి ఎస్ సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని సాయిచరణ్ ఆలపించారు. సినిమా కాన్సెప్ట్ను ఆవిష్కరిస్తూ పాట అర్థవంతంగా సాగింది. తండ్రీకూతుళ్ల అనబంధం నేపథ్యంలో ఈ సినిమా ఆకట్టుకుంటుందని నిర్మాత ఎంవీఆర్ కృష్ణ పేర్కొన్నారు. అరుణ్రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్ తదితరులు ఈ చిత్ర తారాగణం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events