నేపాల్ నూతన అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం చేశారు. నేపాల్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ హరికృష్ణ కర్కి ఇవాళ 78 ఏండ్ల పౌడెల్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. నేపాల్ అధ్యక్ష కార్యాలయంలోని శీతల్ నివాస్‌లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. నేపాల్ మాజీ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ పదవీకాలం ఈ నెల 12తో ముగిసింది. ఈ నేపథ్యంలో గత గురువారమే నూతన అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్‌ను ఎన్నుకున్నారు.