
రామ్ చరణ్ , ఉపాసన దంపతులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారతదేశంలో ప్రాచీన క్రీడ అయిన ఆర్చరీకి తిరిగి ప్రాచుర్యం కల్పించేందుకు వారు చేస్తున్న సేవలను అభినందించారు. వారితోపాటూ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ చైర్మన్ అనిల్ కామినేని కృషిని కూడా ప్రధాని ప్రశంసించారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు అనిల్ కామినేని సారథ్యంలో వరల్డ్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరు ప్రధాని మోదీని కలిశారు. ప్రధానితో సమావేశమైన చరణ్, ఉపాసన, అనిల్ కామినేనిలు లీగ్‌కు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి జ్ఞాపికతో పాటు, ప్రత్యేకంగా తయారు చేయించిన విల్లును మోదీకి అందించారు.
















