రామ్చరణ్ నటిస్తున్న 16వ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గ్రామీణ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్గ్రౌండ్లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ కథ సాగుతుందని సమాచారం. పెద్ది అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. ఇదిలా వుండగా రామ్చరణ్ మరో చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్నది. హాయ్ నాన్న చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు శౌర్యువ్. ఆయన ఇటీవల రామ్చరణ్కు ఓ కథని వినిపించారని తెలిసింది. కథలోని కొత్తదనం, తన పాత్ర నచ్చడంతో ఈ సినిమాకు రామ్చరణ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే మాత్రం చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
