Namaste NRI

పైలం పిలగా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసిన రామ్ మిర్యాల

సాయితేజ, పావని జంటగా రూపొందిన చిత్రం పైలం పిలగా.  ఆనంద్‌ గుర్రం దర్శకుడు. రామకృష్ణ బొద్దుల, ఎస్‌.కె.శ్రీనివాస్‌ నిర్మాతలు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విజయవాడ కేఎల్‌ యూనివర్సిటీలోని రామ్ మిర్యాల  విడుదల చేశారు. అంబానీలా వేలకోట్లకు అధిపతి అవ్వాలనేది అతని లక్ష్యం. విలువలేని వ్యవసాయం చేయలేక, వలసపోయి కార్పొరేట్‌ బానిస కాలేక, ఉన్న ఊళ్లోనే వ్యాపారిగా మారి, పదిమందికి పని కల్పించి తద్వారా కోట్లు సంపాదించాలనే అత్యుత్సాహం ఓ మధ్య తరగతి యువకుడ్ని ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్లింది? అతను పడ్డ అవస్థలేంటి? ఈ నేపథ్యంలో సాగే హాస్యభరిత వ్యంగ్యచిత్రం.  యువతరం మెచ్చే చిత్రం ఇదని చిత్రయూనిట్‌ తెలిపింది. రామ్‌ మిర్యాల సంగీత కార్యక్రమం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డబ్బింగ్‌ జానకి, చిత్రం శ్రీను, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చౌరస్తా యశ్వంత్‌నాగ్‌, కెమెరా: సందీప్‌ బద్దుల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events