సోలమన్ జడ్సన్, రాజ్ బాలా, మరో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రామ్ వర్సెస్ రావణ్. ఈ చిత్రంలో సప్తగిరి కీలక పాత్రలో నటిస్తున్నారు. కె.శుక్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. షాన ప్రోడక్షన్స్ పతాకంపై డాక్టర్ ఎఎస్ జడ్సన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు మారుతి, ఫైట్‌మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్, నిర్మాత సింధూరపువ్వ కృష్ణారెడ్డి అతిథులుగా హాజరయ్యారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ మొదటగా తనకు ఏంజెల్ సినిమాతో దర్శకుడిగా అవకాశం వచ్చిందన్నారు. సింధూరపువ్వ కృష్ణారెడ్డిగారు తనకు దైవంతో సమానమని తెలిపారు. అలాగే తనకు సపోర్ట్ ఇచ్చిన మా దర్శకుడు రాజమౌళి, వైవిఎస్ చౌదరి, శ్రీనివాసరెడ్డి, ఎన్.శంకర్ వీళ్లందరి వల్లే ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. ఈ చిత్రం ప్రారంభం చాలా అనందంగా ఉందన్నారు.