రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలు. టాకీ పార్ట్ పూర్తయింది. బ్యాలెన్స్‌గా ఉన్న రెండు గీతాల్ని స్పెయిన్‌లోని సుందరమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. పాటలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. క్రమశిక్షణతో వృతి ధర్మాన్ని నిర్వర్తించే రామారావు అనే ప్రభుత్వ ఉద్యోగి కథ ఇది. రవితేజ పాత్రలో భిన్న పార్శాలుంటాయి. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభించింది. త్వరలో ప్రచార కార్యక్రమాల్ని ప్రారంభిస్తామని చిత్ర బృందం తెలింది. వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్, సంగీతం: సామ్ సీఎస్, నిర్మాణ సంస్థలు: ఎస్‌ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ. సుధాకర్ చెరుకూరి నిర్మాత.














