Skip to main content

Namaste NRI

స్పెయిన్‌ లో రామారావు ఆన్‌ డ్యూటీ

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్‌ డ్యూటీ. దివ్యాంక కౌశిక్‌, రజిషా విజయన్‌ కథానాయికలు. టాకీ పార్ట్‌ పూర్తయింది. బ్యాలెన్స్‌గా ఉన్న రెండు గీతాల్ని స్పెయిన్‌లోని సుందరమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. పాటలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. క్రమశిక్షణతో వృతి ధర్మాన్ని నిర్వర్తించే రామారావు అనే ప్రభుత్వ ఉద్యోగి కథ ఇది. రవితేజ పాత్రలో భిన్న పార్శాలుంటాయి. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభించింది.  త్వరలో ప్రచార కార్యక్రమాల్ని ప్రారంభిస్తామని చిత్ర బృందం తెలింది.  వేణు తొట్టెంపూడి, నాజర్‌, నరేష్‌, పవిత్రా లోకేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సత్యన్‌ సూర్యన్‌, సంగీతం: సామ్‌ సీఎస్‌, నిర్మాణ సంస్థలు: ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్‌ మండవ. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత.

Social Share Spread Message

Latest News