మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. యూరప్‌లోని అందమైన లొకేషన్లలో పాటలను తెరకెక్కించనున్నారు. భారతదేశంలోని దట్టమైన అడవుల్లో ఈ యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరిస్తారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు త్టొటెంపూడి ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. రవితేజ, విద్యాంక కౌశిక్, రజిసా విజయన్, వేణు త్టొటెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈ రోజుల్లో శ్రీ, సురేఖా వాణి తదితరులు నటిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్ కే ఎల్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.