Skip to main content

Namaste NRI

చివరి షెడ్యూల్ కు రామారావు ఆన్ డ్యూటీ

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్‌ డ్యూటీ. ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. యూరప్‌లోని అందమైన లొకేషన్లలో పాటలను తెరకెక్కించనున్నారు. భారతదేశంలోని దట్టమైన అడవుల్లో ఈ యాక్షన్‌ సీన్స్‌ను చిత్రీకరిస్తారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దివ్యాంక కౌశిక్‌, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు త్టొటెంపూడి ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. రవితేజ, విద్యాంక కౌశిక్‌, రజిసా విజయన్‌, వేణు త్టొటెంపూడి, నాజర్‌, నరేష్‌, పవిత్రా లోకేష్‌, తనికెళ్ల భరణి, రాహుల్‌ రామకృష్ణ, ఈ రోజుల్లో  శ్రీ, సురేఖా వాణి తదితరులు నటిస్తున్నారు. సత్యన్‌ సూర్యన్‌ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్‌ కే ఎల్‌ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శరత్‌ మాండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌ మీద సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News