95వ అకాడమీ అవార్డుల వేడుకకు సమయం దగ్గరపడుతోంది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బి థియేటర్లో ఆస్కార్ వేడుకలకు అంతా రెడీ అయింది. ఆర్ఆర్ఆర్ యాక్టర్లు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ అండ్ టీం వేడుకలో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ టీం ఈవెంట్ షురూ అయ్యే కంటే ముందే ఏదో ఒక అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు.
తారక్, రాంచరణ్ తమ విలువైన సమయాన్ని ఓ వైపు హాలీవుడ్ సెలబ్రిటీలతో, మరోవైపు అభిమానులతో చిట్ చాట్ చేసేందుకు కేటాయిస్తున్నారు. రాంచరణ్ లాస్ ఏంజెల్స్లో మూవీ లవర్స్, అభిమానులతో చిట్ చాట్ సెషన్లో పాల్గొన్నాడు. ఈ సమావేశంలో అభిమానులు కూర్చున్న ప్రతి టేబుల్ వద్దకు వెళ్లి వారితో కరచాలనం చేసి ఫొటోలు దిగాడు. ఈ సందర్భంగా యూఎస్ఏ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ తమ ఆరాధ్య హీరో రామ్ చరణ్ కు కృతజ్ఞతలు తెలిపింది.