కల్యాణ్‌రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కెతున్నది. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. ఇప్పటికే ఈ మూవీ నుంచి కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల ను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. సీనియర్ నటి విజయశాంతి సుదీర్ఘ విరామం తర్వాత మరోమారు పోలీస్ అధికారి పాత్ర ద్వారా ప్రేక్షకులను ఆమె పలకరించబోతున్నారు. ఈ సినిమాలో విజయశాంతి వైజయంతీ ఐపీఎస్ పాత్రను పోషిస్తున్నది.
విజయశాంతి బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి రాములమ్మ ఫస్ట్ లుక్‌తో పాటు స్పెషల్ గ్లింప్స్ వదిలారు. వైజయంతీ ఐపీఎస్, తను పట్టుకుంటే పోలీస్ తుపాకికే ధైర్యం వస్తుంది. వేసుకుంటే యూనిఫాంకే పౌరుషం వస్తుంది..తానే ఒకయుద్ధం, నేను తన సైన్యం అంటూ కల్యాణ్‌రామ్ వాయిస్ ఓవర్‌తో ఆమె పాత్రను పరిచయం చేశారు. సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్‌ప్రసాద్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాతలు: అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు, రచన-దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి.