రజినీకాంత్ నటిస్తున్న చిత్రం వెట్టయన్. టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తోపాటు టాలీవుడ్ యాక్టర్ రానా కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసిందే.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను షేర్ చేసుకున్నాడు రానా. హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతుండగా, సెట్స్‌లో జాయిన్ అయ్యాడు రానా. సెట్స్‌లో చేరే ముందు సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
టైటిల్ టీజర్‌ను విడుదల చేయగా, బుక్ రీడింగ్ తర్వాత చేతిలో స్టిక్ పట్టుకొని, స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న రజినీకాంత్ విజువల్స్ అభిమానులకు విజువల్ ట్రీట్ అందిస్తున్నాయి. ఏడు పదుల వయస్సులోనూ అదే స్టైల్, అదే స్టైల్ మ్యానరిజాన్ని చూపిస్తూ ఏ మాత్రం తగ్గేదే లే అంటూ ఔరా అనిపిస్తున్నాడు తలైవా.ఈ మూవీ లో రితికా సింగ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. జైభీమ్ లాంటి సామాజిక సందేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన జ్ఞానవేళ్ సిల్వర్ స్క్రీన్‌పై ఇద్దరు లెజెండరీ యాక్టర్లను ఎలాంటి పాత్రల్లో చూపించబోతున్నాడన్నది సస్పెన్స్ నెలకొంది.