నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఓ వ్యవసాయ కుటుంబ భావోద్వేగ ప్రయాణమే ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతోన్న చిత్రం బాపు. నటుడు బ్రహ్మాజీ లీడ్‌రోల్ పోషిస్తున్నారు. దయా దర్శకత్వం. రాజు, సిహెచ్ భాను ప్రసాద్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆమని, బలగం సుధాకర్‌రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ, కీలక పాత్రధారులు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని నటుడు రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. హాయిగా డైనింగ్ ఛైర్‌లో కూర్చుని, తనకోసం వడ్డించిన వంటకాలవైపు చూస్తున్న తండ్రిని, ఆయన చుట్టూ గుమిగూడిన కుటుంబాన్ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. చుట్టూ ఉన్న కుటుంబసభ్యుల ఎక్స్‌ప్రెషన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇది డార్క్ కామెడీ, హ్యూమర్‌తో కూడిన ఎమోషనల్ జర్నీ అనీ, మనసులను హత్తుకునేలా ఈ సినిమా ఉంటుందని, త్వరలోనే విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. మణి ఏగుర్ల, రవి చర్ల, గంగవ్వ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు పెండెం, సంగీతం: ఆర్.ఆర్.ధ్రువన్, నిర్మాణం: కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్.