టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, రానా కాంబినేషన్‌లో తెరకెక్కిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు. అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్‌గా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలైంది. డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఈ వెబ్ ప్రాజెక్ట్‌కు మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. ఈ చిత్రం లో సుచిత్ర పిళ్లై, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా, ప్రియా బెనర్జీ, ఆదిత్యా మీనన్, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్, మిలింద్ పాఠక్, ఆశిష్ విద్యార్థి రానానాయుడులో కీలక పాత్రల్లో నటించారు.

తండ్రీ కొడుకులుగా నాగానాయుడు (వెంకటేశ్), రానా నాయుడు (రానా) మధ్య జరిగే హోరాహోరీ పోరు, ఇతర అంశాల చుట్టూ తిరిగే కథాంశంతో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన రానా నాయుడు ఇక సీజన్ 2తో కూడా సందడి చేయబోతుంది. నెట్‌ఫ్లిక్స్ రానా నాయుడు సీజన్ 2 గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. బాధపడకండి, మీ సమస్యలన్నీ సరిచేసేందుకు నాయుడులు తిరిగొస్తున్నారు. రానా నాయుడు సీజన్ 2 త్వరలో రాబోతోంది. సీజన్ 2 మొదటి సీజన్‌ను మించి ఉండబోతుందని గ్లింప్స్ వీడియోతో అర్థమవుతోంది. ఈ వెబ్ ప్రాజెక్ట్‌లో రానా సినిమా యాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులను వారి సమస్యల నుంచి రక్షించే పాత్రలో కనిపిస్తాడని తెలిసిందే.

