చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం పారిజాతపర్వం. సంతోష్ కంభంపాటి దర్శకుడు. మహీధర్‌రెడ్డి, దేవేష్ నిర్మాతలు. క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి చెందిన పాటను మేకర్స్ విడుదల చేశారు. రంగ్ రంగ్ రంగీలా అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, రీ స్వరపరిచారు. శ్రద్ధాదాస్ ఈ పాటను స్వయంగా పాడటం విశేషం. శ్రద్ధాదాస్ వాయిస్, గ్లామర్ ప్రెజెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని మేకర్స్ చెబుతున్నా రు. వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖవాణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల సరస్వతి.
