Skip to main content

Namaste NRI

పారిజాత పర్వం నుంచి రంగ్ రంగ్ రంగీలా  సాంగ్

చైతన్యరావు, సునీల్‌, శ్రద్ధాదాస్‌, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం పారిజాతపర్వం. సంతోష్‌ కంభంపాటి దర్శకుడు. మహీధర్‌రెడ్డి, దేవేష్‌ నిర్మాతలు. క్రైమ్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి చెందిన పాటను మేకర్స్‌ విడుదల చేశారు. రంగ్‌ రంగ్‌ రంగీలా అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, రీ స్వరపరిచారు. శ్రద్ధాదాస్‌ ఈ పాటను స్వయంగా పాడటం విశేషం. శ్రద్ధాదాస్‌ వాయిస్‌, గ్లామర్‌ ప్రెజెన్స్‌ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని మేకర్స్‌ చెబుతున్నా రు. వైవా హర్ష, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సురేఖవాణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల సరస్వతి.

Social Share Spread Message

Latest News