Namaste NRI

నన్ను నన్నుగా ఆకట్టుకుంటున్న రంగమార్తాండ

 ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం రంగమార్తాండ. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్  షాయరి భారీ ప్రేక్షకాదరణ పొందింది. ఈ  చిత్రం రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లిన  కథ. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో చెప్పిన ఈ షాయరీని రచయిత లక్ష్మీ భూపాల రచించగా పలువురు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ నన్ను నన్నుగా అభిమానులకు ఆకట్టుకుంటోంది. దీనికి సిరివెన్నల  సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా సినిమాకు మాస్ట్రో ఇళయరాజా నేపధ్య సంగీతం అందించాడు. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ ఈ సాంగ్లో నటించారు. ఇక రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లిన కథలో బ్రహ్మానందం, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజా, అనసూయ, కీలక పాత్రలో    కనిపించబోతున్నారు.   2023 డిసెంబర్ 10న ఈ మూవీ విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events