రావు రమేష్ కథానాయకుడిగా పీబీఆర్ సినిమాస్ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 2గా రూపొందిస్తున్న సినిమా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. ఇందులో నటి ఇంద్రజ కీలక పాత్ర పోషిస్తోంది. లక్షణ్ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. రావు రమేష్ గారు లీడ్ రోల్ చేయడానికి అంగీకరించడం మా ఫస్ట్ సక్సెస్. కథ నచ్చి ఆయన ఓకే చేశారు. నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులతో రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం అని చెప్పారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.