Namaste NRI

రజినీకాంత్‌, బాలకృష్ణకు అరుదైన గౌరవం

ప్రముఖ స్టార్‌ నటులు రజినీకాంత్ , బాలకృష్ణ కు అరుదైన గౌరవం దక్కింది. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వీరిద్దరినీ ఘనంగా సన్మానించనున్నట్లు కేంద్ర మంత్రి తాజాగా వెల్లడించారు. ఈ ఏడాది గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేడుకల్లో వీరిని సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ తెలిపారు.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సమక్షంలో జరిగిన సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.  సినిమా రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు దిగ్గజ నటులు రజినీకాంత్‌, నందమూరి బాలకృష్ణలను సత్కరించనున్నాం. అద్భుతమైన నటనతో దశాబ్దాలుగా వారు ఎన్నో మంచి కథలను ప్రేక్షకులకు అందించారు. భారతీయ సినిమా పట్ల వారి కృషి, సహకారానికి గుర్తింపుగా ముగింపు వేడుకల్లో వారిని సత్కరించనున్నాం. ఇది భారతీయ సినిమా రంగంలోనే ఒక మైలురాయి అని ఎల్‌.మురుగన్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News