రష్మిక మందన్ననటించిన తాజా హిందీ చిత్రం ఛావా. మరాఠీ చా రిత్రక యోధుడు ఛత్రపతి శంభా జీ వీరోచిత పోరాటగాథను ఆవిష్కరిస్తూ పీరియాడిక్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటించగా, ఆయన భార్య మహారాణి యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న కనిపించనుంది.
రష్మిక మందన్న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సంప్రదాయ మరాఠీ వస్త్రధారణలో బంగారు ఆభరణాలు ధరించి రాజ సం ఉట్టిపడుతూ కనిపిస్తున్నది రష్మిక. గొప్ప రాజులందరీ విజయాల వెనక శక్తివంతులైన మహారాణుల పాత్ర ఉంటుంది. మహారాణి యేసుబాయి, ది ప్రైడ్ ఆఫ్ స్వరాజ్య అంటూ ఈ స్టిల్‌కు క్యాప్షన్‌ను జత చేశారు. లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.