తానా ఫౌండేషన్ సెక్రెటరీగా, 2019 కాన్ఫరెన్స్ ఫండ్ రైజింగ్ కమిటీ చైర్మన్గా, భూరి విరాళాల దాతగా తానాకి విశేష సేవలందిస్తున్న రవి మందలపునకు సంస్థలో మరో కీలక బాధ్యత దక్కింది. తానా కాన్ఫరెన్స్ చైర్మన్ పదవిని కాన్ఫరెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మార్చిన సంస్థ యాజమాన్యం ఈ బాధ్యతలను రవికి అప్పగించింది. రవి మందలపు విశేష సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ బాధ్యతలు దక్కాయి.














